రూ. 2000 వేల నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపేసిన ఆర్బీఐ..

డీ-మోనిటైజేషన్‌లో భాగంగా మోదీ సర్కార్ నాలుగు సంవత్సరాల క్రితం రూ. 1000, రూ. 500 నోట్లను బ్యాన్ చేసి.. రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

రూ. 2000 వేల నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపేసిన ఆర్బీఐ..
Follow us

|

Updated on: Aug 09, 2020 | 10:46 PM

Rs 2000 Notes Printing Stopped: డీ-మోనిటైజేషన్‌లో భాగంగా మోదీ సర్కార్ నాలుగు సంవత్సరాల క్రితం రూ. 1000, రూ. 500 నోట్లను బ్యాన్ చేసి.. రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనితో 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఆర్బీఐ ఏకంగా రూ. 354.29 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించింది. ఇక ఆ తర్వాత వరుసగా 2017-18లో రూ. 11.15 కోట్లు, 2018-19లో రూ. 4.66 కోట్ల విలువైన 2 వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ.. గడిచిన ఆర్ధిక సంవత్సరంలో మాత్రం అసలు ఒక్క రూ. 2 వేల నోటు ముద్రణ చేయలేదు.

ఇక ఈ వివరాలను ఆర్టీఐ కార్యకర్త సుధీర్ సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకున్నారు. ” వాస్తవానికి రూ. 2,000 నోట్ల ముద్రణ గణనీయంగా తగ్గింది. ఈ పెద్ద నోట్ల ముద్రణను కనిష్టానికి పరిమితం చేయాలని నిర్ణయించాం. అందుకే పూర్తిగా పరిమితంలో ఉంచామని.. నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

ఇదిలా ఉంటే రూ. 2000 నోట్ల ముద్రణ కంటే రూ. 500 నోట్ల ముద్రణ గణనీయంగా పెరిగింది. 2016-17 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే గతేడాది రెండు రెట్లు అంటే దాదాపు రూ. 822.77 కోట్ల విలువైన రూ. 500 నోట్ల ముద్రణ జరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇక నాలుగేళ్లలో రూ. 2,458.57 కోట్ల విలువైన రూ. 500 నోట్ల ముద్రణ జరిగితే.. కేవలం రూ. 370.10 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్ల ముద్రణ మాత్రమే జరిగిందని ఆర్బీఐ తెలిపింది. కాగా, రూ.1, 2, 5 లాంటి చిన్న నోట్ల ముద్రణను సైతం ఆర్బీఐ నిలిపివేసింది. అయితే ఇప్పటివరకు చలామణి అవుతున్న నోట్లు చెల్లుతాయి. వాటిపై ఎలాంటి బ్యాన్ లేదు. కేవలం నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగానే రూ. 2000 నోట్ల ముద్రణను ఆపేసి.. రూ. 500 నోట్ల ముద్రణను పెంచినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్లీ వస్తుందా.. రీజన్, లక్షణాల ఏమిటంటే
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
CI తిట్టాడని రాజీనామా చేసిన కానిస్టేబుల్ ఏకంగా కలెక్టరయ్యాడు
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
ఇద్దరే ఇద్దరూ! పంజాబ్‌తో మ్యాచ్ రోహిత్ కు చాలా స్పెషల్..
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బుల్లెట్‌ ట్రైన్‌లో బుస్ బుస్.. కట్ చేస్తే ఉన్నపళంగా ఉరుకో ఉరుకు
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..
బాక్సాఫీస్‏ను షేక్ చేసిన హీరోయిన్.. ప్రియుడి ఇంటి ముందు శవమై..