చైనాలో మరో విషాదం.. కొండచరియలు విరిగి పడటంతో..

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పురుడుపోసుకున్న చైనాలో మరో విషాదం చోటుచేసకుంది. ఇప్పటికే అక్కడ మరో రెండు వైరస్‌లు ప్రజల్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. దేశంలోని హుబై..

చైనాలో మరో విషాదం.. కొండచరియలు విరిగి పడటంతో..

Updated on: Jul 08, 2020 | 3:39 PM

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి పురుడుపోసుకున్న చైనాలో మరో విషాదం చోటుచేసకుంది. ఇప్పటికే అక్కడ మరో రెండు వైరస్‌లు ప్రజల్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. దేశంలోని హుబై ప్రావిన్స్‌లో భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో తొమ్మిది మంది సజీవ సమాధి అయ్యారు. హువాంగ్మీ కౌంటీలోని దాహే టౌన్‌షిప్‌ ప్రాంతంలో బుధవారం తెల్ల వారు జామున ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే.. రెస్క్యూ టీం రంగంలోకి దిగింది. విరిగిపడ్డ కొండ చరియలను తొలగించే పని చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇక మరణించిన వారి మృతదేహాలను వెలికితీసి.. పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us