టెస్టుల్లో తొలి సబ్‌స్టిట్యూట్‌.. అరంగేట్రంలోనే అదుర్స్!

టెస్ట్ క్రికెట్‌లోనే తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్నస్ లబ్‌షేన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో యాషెస్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో పేసర్ ఆర్చర్ బౌన్సర్‌కు గాయపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్థానంలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు లబ్‌షేన్. స్మిత్ గాయపడ్డ నేపథ్యంలో ఐసీసీ కొత్త నిబంధనల మేరకు ఆసీస్ సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించగా.. అందుకు అంగీకారం లభించింది. సవరించిన నిబంధనల ప్రకారం కాంకషన్ సబిస్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్ […]

టెస్టుల్లో తొలి సబ్‌స్టిట్యూట్‌.. అరంగేట్రంలోనే అదుర్స్!

Updated on: Aug 19, 2019 | 7:11 PM

టెస్ట్ క్రికెట్‌లోనే తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్నస్ లబ్‌షేన్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో యాషెస్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో పేసర్ ఆర్చర్ బౌన్సర్‌కు గాయపడ్డ ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్థానంలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేశాడు లబ్‌షేన్. స్మిత్ గాయపడ్డ నేపథ్యంలో ఐసీసీ కొత్త నిబంధనల మేరకు ఆసీస్ సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించగా.. అందుకు అంగీకారం లభించింది. సవరించిన నిబంధనల ప్రకారం కాంకషన్ సబిస్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్ మాత్రమే కాకుండా.. బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది.

ఇక స్టీవ్ స్మిత్ స్థానంలో అత్యంత కీలక సమయంలో బరిలోకి వచ్చిన లబ్‌షేన్.. అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. టీమ్‌కు కావాల్సిన పరుగులను రాబట్టడంతో రెండో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. దీంతో ఆసీస్‌కు ఊరట లభించింది. మరోవైపు ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో ఆర్చర్‌ వేసిన బంతి లబుషేన్‌ హెల్మెట్‌ గ్రిల్‌కు తాకడంతో ఆటగాళ్లందరూ ఊపిరి పీల్చుకున్నారు.