KTR Global Governance: మరో అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్న కేటీఆర్‌.. ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు నుంచి ఆహ్వానం..

|

Jan 06, 2021 | 7:54 AM

KTR Global Technology Governance: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మరో అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్నారు...

KTR Global Governance: మరో అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్న కేటీఆర్‌.. ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు నుంచి ఆహ్వానం..
Follow us on

KTR Global Technology Governance: తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మరో అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్నారు. ఏప్రిల్‌ 5 నుంచి 7 వరకు జపాన్‌ రాజధాని టోక్యోలో జరగనున్న ప్రపంచ సాంకేతిక పరిపాలన (గ్లోబర్‌ టెక్నాలజీ గవర్నెన్స్) సదస్సు – 2021కు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహిస్తున్న ఈ సదస్సుకు హాజరుకావాలని కోరుతూ ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడు బోర్గ్‌ బ్రండే కేటీఆర్‌కు మంగళవారం లేఖ రాశారు. ఈ లేఖలో బోర్గ్‌ పలు విషయాలను ప్రస్తావిస్తూ.. కరోనా సంక్షోభం అనంతరం ప్రపంచ దేశాలు తిరిగి అభివృద్ధి పథంలో నడిచేందుకు కొత్త టెక్నాలజీ వినియోగం, నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, సాంకేతిక పరిమితులు, నూతన ఆవిష్కరణలు తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చిస్తామని బోర్గ్‌ తెలిపారు. ఇక తెలంగాణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ.. సామాజిక లబ్ధి కోసం వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నారని బోర్గ్‌ ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక ఈ సదస్సుకు ఆహ్వానం అందడం పట్ల స్పందించిన మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఇది తెలంగాణకు లభించిన మరో గుర్తింపు అని చెప్పుకొచ్చారు. ఈ సదస్సులో పాల్గొని నూతన టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ సాధించిన పురోగతిని ప్రపంచ దేశాలకు తెలియజేస్తామని చెప్పుకొచ్చారు.

Also Read: Murder in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భూ వివాదంలో కత్తులతో దాడి.. ఒకరు మృతి