శివాలయంలో రెండు రోజులుగా అరుదైన నాగు పాము తిష్ఠ.. పూజారి ఏం చేశారంటే?
భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. హిందువులు ప్రతి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ముఖ్యంగా పరమశివుడికి సంబంధించి పర్వదినాలు అయితే.. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. అయితే ఓ శివాలయంలో రెండు రోజులుగా రెండు నాగు పాము దర్శనం ఇచ్చాయి. సరిగ్గా శివలింగం మీద చుట్టుకుని కూర్చుని ఉండిపోయాయి. ఎంతకీ పాము బయటకు వెళ్లకపోవడంతో పూజారులు, భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో శివకేశవాలయాల మధ్యలో ఉన్న శ్రీకాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర పుత్ర శక్తి గణపతి ఆలయంలో నాగు పాములు హల్చల్ చేశాయి. గత రెండు రోజులుగా రెండు విష్ణు పాదాలు ఉన్న గోధుమ త్రాచు తిష్ట వేసింది. రెండు రోజులుగా ఆలయం లోపల శివలింగం చుట్టూ తిరగడం చూసి ఆలయ అర్చకులు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఈ విషయం తెలిసిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చిన దర్శనం చేసుకుంటున్నారు.
అయితే రెండు రోజులైనా బయటకు రాకపోవడంతో దేవుడికి నైవేద్యం పెట్టడానికి పూజారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయంల నుండి నాగు పాము వెళ్ళకపోవడంతో ఆలయ కమిటీ రాజమండ్రికి చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ రాజమండ్రి మాధవ్ కు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ సుమారు రెండు గంటల శ్రమించి, చాకచక్యంగా పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారని ఆలయ కమిటీ చైర్మెన్ చింతా సూర్య చంద్ర రావు తెలిపారు. దీంతో అంతా ఉపిరి పీల్చుకున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..