ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ).. డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో బన్నీ పక్కా ఊర మాస్ లుక్‌లో స్మగ్లర్ పుష్ప రాజ్ పాత్రలో నటించగా.. అతని ప్రేయసి పాత్రలో రష్మిక మందన్న నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇందులోని డైలాగ్స్… పాటలకు భారీ స్తాయిలో రెస్పాన్స్ వస్తుంది. అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్, సాంగ్స్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలోని పాటలకు విదేశీయులు సైతం ఫిదా అవుతున్నారు.
ఖండాంతరాలను దాటి పుష్ప క్రేజ్ కొనసాగుతుంది. తాజాగా రష్మిక, బన్నీ మధ్య సాగే ఓ ఫన్నీ డైలాగ్‌ను టాంజెనియా కుర్రాడు.. తమ సంప్రదాయ కిలీ దుస్తులను ధరించి పుష్ప డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నాడు. అందులో నేను బాగున్నాను కదా.. అని అల్లు అర్జున్ అడగడం.. నేను చూడలేదని.. నువ్వు పులుపెక్కి పొతాండవంట కదా అంటూ రష్మిక చెప్పే డైలాగులకు అతను పెదాలు కదిపాటు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
Viral Photo: చెట్టును హత్తుకున్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? ఇలా చేస్తే ఎన్నో లాభాలంటా..
Gehraiyaan: ‘స్కిన్‌షో తప్ప ఏముంది..’ ‘గెహ్రాహియా’ చెత్త సినిమా అంటూ కంగనా సంచలన కామెంట్స్