బైక్ మీద కూర్చుంటే కాళ్లు నేలకుతాకడం లేదు.. స్పీడ్‌గా బైక్ నడుపుతున్న బాలుడు.. ప్రాణం విలువ గుర్తించమని విజ్ఞప్తి

కొన్ని వీడియోలు చాలా కోపాన్ని కూడా తీసుకుని వస్తాయి. చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రమాదానికి దారి తీస్తుంది. రోడ్డుపై చాలా జాగ్రత్తగా నడవాలని, వాహనాలు నడపాలని పోలీసులు, ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది అటువంటి హెచ్చరికలను పట్టించుకోరు. తాజాగా ఓ చిన్నారి బాలుడు బైక్ నడుపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

బైక్ మీద కూర్చుంటే కాళ్లు నేలకుతాకడం లేదు.. స్పీడ్‌గా బైక్ నడుపుతున్న బాలుడు.. ప్రాణం విలువ గుర్తించమని విజ్ఞప్తి
Viral Video
Follow us

|

Updated on: Apr 23, 2024 | 8:57 PM

నేటి జనరేషన్ పుట్టుకతో కొన్ని పుట్టక ముందే కొన్ని నేర్చేసుకుంటున్నారు. చిన్న పిల్లలు కూడా అద్భుతంగా విన్యాసాలు చేస్తుంటే వారి ఫీట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నిసార్లు వైరల్ అయ్యే పిల్లలకు సంబంధించిన వీడియోలను చూసి మనం సంతోషిస్తాం. అయితే కొన్ని వీడియోలు చాలా కోపాన్ని కూడా తీసుకుని వస్తాయి. చిన్నపాటి అజాగ్రత్త కూడా ప్రమాదానికి దారి తీస్తుంది. రోడ్డుపై చాలా జాగ్రత్తగా నడవాలని, వాహనాలు నడపాలని పోలీసులు, ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కొంతమంది అటువంటి హెచ్చరికలను పట్టించుకోరు. తాజాగా ఓ చిన్నారి బాలుడు బైక్ నడుపుతున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

బైక్ నడుపుతున్న ఆ పిల్లవాడికి 10-12 ఏళ్లు ఉంటాయని.. బైక్ మీద కూర్చుంటే రెండు కాళ్లు సరిగ్గా నేలకి తాకడం లేదు. అయినప్పటికీ ఆ బాలుడు బైక్ స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొదట్లో పిల్లాడు సరదాగా బైక్ స్టార్ట్ చేస్తున్నట్టు అనిపించినా బైక్ స్టార్ట్ చేసి తన వెనుక చిన్న పిల్లాడిని కూర్చోబెట్టుకుని వేగంగా బైక్ నడపడం మొదలు పెట్టాడు. కాళ్లు నెలకు అందకపోయినా బైక్‌పై చిన్నారిని కూర్చుబెట్టుకుని నడిపిస్తున్నాడు. సాధారణంగా ఈ వయస్సు పిల్లలు సైకిల్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయలేరు. అయితే ఇప్పుడు ఆ పిల్లవాడు బైక్ నడుపుతూ కనిపిస్తున్నాడు.

వీడియో చూడండి

హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి పంకజ్ నైన్ ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు వీడియోకు ఒక క్యాప్షన్‌ జత చేశారు.. ‘ఇంతకంటే ప్రమాదకరమైనది ఏమిటి! తల్లిదండ్రులారా దయచేసి మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి. జీవితం విలువైనది’.

కేవలం 25 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 11 వేలకు పైగా వీక్షించగా.. వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి వివిధ రకాల రియాక్షన్‌లు ఇచ్చారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఇలాంటి పనులు చేయడం పట్ల గర్వపడుతున్నారని ఓ యూజర్ రాస్తే, ‘ఇది చాలా ప్రమాదకరం’ అని మరొకరు కామెంట్ చేశారు. అదేవిధంగా  మరొకరు నగరాలలో ఇలాంటివి సాధారణం ఇక్కడ 8-10 సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలు ఎటువంటి భద్రత లేకుండా స్కూటర్లను నడుపుతారని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles