శిఖర్‌పై కెవిన్‌ పీటర్సన్‌ హాస్య చమక్కులు..

|

Sep 27, 2020 | 4:32 AM

ఆడుతున్నది ఎక్కడైనా.. మన ఆటగాళ్ల స్టైల్ చాలా డిఫరెంట్.. దుబాయ్‌ వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్-2020 లీగ్‌లో ఢిల్లీ జట్టు సభ్యుడు శిఖర్‌ ధావన్ కొత్త కళ్ల జోడుతో మెరిసిపోయాడు.‌..

శిఖర్‌పై కెవిన్‌ పీటర్సన్‌ హాస్య చమక్కులు..
Follow us on

ఆడుతున్నది ఎక్కడైనా.. మన ఆటగాళ్ల స్టైల్ చాలా డిఫరెంట్.. దుబాయ్‌ వేదికగా శుక్రవారం జరిగిన ఐపీఎల్-2020 లీగ్‌లో ఢిల్లీ జట్టు సభ్యుడు శిఖర్‌ ధావన్ కొత్త కళ్ల జోడుతో మెరిసిపోయాడు.‌ డిజైన్‌ కళ్లద్దాలతో జిగేలుమన్నాడు. శిఖర్‌ ఫీల్డింగ్‌ చేస్తుంన్న సమయంలో స్పెషల్ గా కనిపించాడు. అతను పెట్టుకున్న కళ్లజోడు లో అవి కామెంటేటర్లను ఆకర్షించాయి. అయితే కామెంట్రీ బాక్సులో కేపీ ఉంటే జోకులతో పొట్ట చెక్కలవుతుంది. ఫుల్ టు ఫుల్ జోకులతో అదరగొడతాడు.

వాటిపై కామెంటేటర్‌, మాజీ ఇంగ్లాండ్‌ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ హాస్య చమక్కులు కురిపించాడు. ధావన్‌ కళ్లద్దాలు అద్భుతంగా ఉన్నాయన్న కేపీ.. తనకు ఎలాగైనా అవి కావాలని కోరాడు. దీంతో కామెంట్రీ బాక్సులో నవ్వుల పువ్వులు విరిశాయి. ఇదిలా ఉండే.. వారం రోజులుగా ఈ క్రికెట్‌ లీగ్‌ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.  స్టేడియంలో ప్రేక్షకులు లేకుంటే చూసేది… ఆడేది ఎలా ప్రశ్నలకు చెక్క్ పెట్టింది. పొట్టి ఆటను మరింత పొట్టిగా మార్చుతున్నారు. సిక్సులు, ఫోర్లతో మెరుపులు మెరిపిస్తున్నారు.