చైల్డ్ పోర్నోగ్రఫీ, కేరళలో 41 మంది అరెస్ట్

| Edited By: Anil kumar poka

Jun 22, 2021 | 4:41 PM

చైల్డ్ పోర్నోగ్రఫీపై కేరళ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఐటీ ప్రొఫెషనల్స్ తో బాటు మొత్తం 41 మందిని వారుఅరెస్టు చేశారు. వీరంతా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా..

చైల్డ్ పోర్నోగ్రఫీ, కేరళలో 41 మంది అరెస్ట్
Follow us on

చైల్డ్ పోర్నోగ్రఫీపై కేరళ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఐటీ ప్రొఫెషనల్స్ తో బాటు మొత్తం 41 మందిని వారుఅరెస్టు చేశారు. వీరంతా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీని సర్క్యులేట్ చేసి షేర్ చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. 362 చోట్ల దాడులు చేసి 268 కేసులను నమోదు చేశామన్నారు. పట్టుబడినవారి నుంచి మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను వారు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలకు సంబంధించిన అసభ్య వీడియోలు, ఫోటోలను షేర్ చేయడం, సర్క్యులేట్గ్ చేయడం చట్టరీత్యా నేరం. ఇందుకు పాల్పడినవారికి అయిదేళ్ల జైలుశిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తారు.