KCR review రేపే కేసీఆర్ హైలెవెల్ రివ్యూ… ఎజెండాలో కీలకాంశాలివే

శుక్రవారం మే 15వ తేదీన ఉన్నత స్థాయి సమీక్షకు రెడీ అవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. రాష్ట్రంలో లాక్ డౌన్‌ను మే 29వ తేదీ దాకా పొడిగించిన సందర్భంలో....

KCR review రేపే కేసీఆర్ హైలెవెల్ రివ్యూ... ఎజెండాలో కీలకాంశాలివే
Follow us

|

Updated on: May 14, 2020 | 7:18 PM

Crucial agenda ready for KCR’s high level review: శుక్రవారం మే 15వ తేదీన ఉన్నత స్థాయి సమీక్షకు రెడీ అవుతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. రాష్ట్రంలో లాక్ డౌన్‌ను మే 29వ తేదీ దాకా పొడిగించిన సందర్భంలో మే 15వ తేదీన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఆనాటి పరిస్థితికి అనుగుణంగా లాక్ డౌన్‌పైనా, కరోనా నియంత్రణా చర్యలపై తగిన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సమీక్షకు రంగం సిద్దమవుతోంది. శుక్రవారం సుదీర్ఘంగా సాగనున్న కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష కోసం కీలక అంశాలతో ఎజెండాను ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు సిద్దం చేసినట్లు సమాచారం.

కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ పొడిగింపు వంటి కీలకాంంశాలపై శుక్రవారం సీఎం కెసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జరపబోతున్నారు. గ్రీన్ జోన్ ఏరియాలలో ప్రజారవాణా, వలస కూలీల సమస్యలపై ప్రధానంగా చర్చించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. దానికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ధాన్యం సేకరణ అంశాన్ని, సేకరణ విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ముఖ్యమంత్రి సమీక్ష జరపనున్నారు. ఈ విషయంలో గురువారం జరిగిన సమీక్షలో ఫీడ్ బ్యాక్‌పై శుక్రవారం సమీక్షలో చర్చ జరపనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, కొనసాగుతున్న కరోనా టెస్టులను కేసీఆర్ సమీక్షించనున్నారు. పరిశ్రమలను ఓపెన్ చేస్తే ఏంటన్న అంశంపై సమాలోచనలు జరపనున్నారు. పరిశ్రమలను ఓపెన్ చేయదలిస్తే.. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై ముఖ్యమంత్రి అధికారుల ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని తెలుస్తోంది. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నా సీఎం.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీపైనా.. దాని వల్ల తెలంగాణకు ఒనగూడే ప్రయోజనంపైనా కేసీఆర్ సమాలోచనలు సాగిస్తారు. రాష్ట్రానికి ఉపయోగపడేలా కేంద్రానికి నివేదించాల్సిన అంశాలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో