రాజ్‌భవన్‌‌లో ఇప్తార్ విందు సందడి

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. రాజ్‌భవన్‌లోని సంస్కృతి మందిరంలో ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌తో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇఫ్తార్‌ విందు సందర్భంగా రాజ్‌భవన్‌లో ముస్లిం […]

రాజ్‌భవన్‌‌లో ఇప్తార్ విందు సందడి

Edited By:

Updated on: Jun 02, 2019 | 8:51 AM

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. రాజ్‌భవన్‌లోని సంస్కృతి మందిరంలో ఏర్పాటు చేసిన ఈ విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌తో పాటు తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటల రాజేందర్‌, తమిళనాడు మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇఫ్తార్‌ విందు సందర్భంగా రాజ్‌భవన్‌లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రముఖుల రాకతో రాజ్‌భవన్‌ సందడిగా మారింది. అంతకముందు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.