భారత్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీనే టాప్.. కంగనా వైరల్ ట్వీట్.!

భారత్‌లో హిందీ చిత్ర పరిశ్రమ టాప్ అని పలువురు అనుకుంటున్నారని.. అది తప్పు అని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ అగ్ర స్థానానికి ఎదిగిందని చెప్పుకొచ్చారు.

భారత్‌లో టాలీవుడ్ ఇండస్ట్రీనే టాప్.. కంగనా వైరల్ ట్వీట్.!

Edited By:

Updated on: Sep 19, 2020 | 5:08 PM

భారత్‌లో హిందీ చిత్ర పరిశ్రమ టాప్ అని పలువురు అనుకుంటున్నారని.. అది తప్పు అని బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ అగ్ర స్థానానికి ఎదిగిందని చెప్పుకొచ్చారు. గత కొన్నేళ్లుగా అనేక భాషల్లో ప్యాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయని ఆమె అన్నారు. అలాగే హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఎన్నో హిందీ సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయని తెలిపారు. (Kangana Ranaut Tweet)

ఇదిలా ఉంటే సినీ రంగంలో ఎన్నో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని కంగనా అన్నారు. అంతేకాకుండా అన్ని భాషల ఇండస్ట్రీలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా తయారు చేయాలని సూచించారు. అనేక కారణాల వల్ల భారతీయ సినీ పరిశ్రమ విడిపోయిందని చెప్పుకొచ్చారు. మన సినీ పరిశ్రమలో ఐక్యత లేకపోవడం వల్లే హాలీవుడ్ సినిమాలకు లాభం చేకూరుతోందని కంగనా తెలిపారు. మనది ఒకే ఇండస్ట్రీ అయినా అనేక ఫిలిం సిటీలు ఉన్నాయని చెప్పారు.

ఎన్నో గొప్ప ప్రాంతీయ సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడం లేదని.. కానీ, డబ్ అయిన హాలీవుడ్ సినిమాలు మాత్రం ప్రాధాన్యతను పొందుతున్నాయని కంగనా స్పష్టం చేశారు. థియేటర్లపై కొందరి గుత్తాధిపత్యం చలాయించడమే దీనికి కారణమని కంగనా రనౌత్ విమర్శిచారు.

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!