కంభంపాటి రామ్మోహన్ రావు రాజీనామా

|

Jun 01, 2019 | 8:08 PM

టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. తనను నమ్మి ఆ హోదాలో   నియమించిన చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం కావడంతో వైసీపీ అధికారాన్ని చేపట్టింది. దీంతో కంభంపాటి రాజీనామా అనివార్యమైంది. మరోవైపు.. పలు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు శనివారం రాజీనామాలు చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ దర్శకుడు కె.రాఘవేంద్ర […]

కంభంపాటి రామ్మోహన్ రావు రాజీనామా
Follow us on

టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్‌రావు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. తనను నమ్మి ఆ హోదాలో   నియమించిన చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం కావడంతో వైసీపీ అధికారాన్ని చేపట్టింది. దీంతో కంభంపాటి రాజీనామా అనివార్యమైంది. మరోవైపు.. పలు నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారు శనివారం రాజీనామాలు చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య, ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ పదవికి అంబికా కృష్ణా.. వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తదితరులు తమ  రాజీనామాలు సమర్పించారు.