Jr NTR : యంగ్ టైగర్ ఆ యువ దర్శకుడికి ఓకే చెప్పాడట, ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్ !

|

Dec 10, 2020 | 8:52 PM

హిట్ దర్శకుడికి యంగ్‌ టైగర్‌ ఓకే చెప్పారట. హిట్ దర్శకుడు అంటే ఇటీవల సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుకోకండి. 'హిట్' సినిమా  మీకు గుర్తుండే ఉంటుంది.

Jr NTR : యంగ్ టైగర్ ఆ యువ దర్శకుడికి ఓకే చెప్పాడట, ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ అంశమే హాట్ టాపిక్ !
Follow us on

‘హిట్’ దర్శకుడికి యంగ్‌ టైగర్‌ ఓకే చెప్పారట. ‘హిట్’ దర్శకుడు అంటే ఇటీవల సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుకోకండి. ‘హిట్’ సినిమా  మీకు గుర్తుండే ఉంటుంది. లాక్‌డౌన్‌కు ముందు హీరో నాని నిర్మించిన ఈ సినిమాలో విశ్వక్‌ సేన్ హీరోగా నటించాడు. ఆ సినిమా డైరెక్టర్‌తోనే ఓ మూవీ ప్లాన్ చేస్తున్నారట యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ‘హిట్’ మూవీని తెరకెక్కించి మంచి మార్కులు అందుకున్నాడు శైలేష్ కొలను.  ఈ సినిమాను తెరకెక్కించిన శైలేష్‌కు ఇండస్ట్రీ వర్గాల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు స్టార్ హీరోల నుంచి పిలుపు కూడా వచ్చింది. ఈ లిస్ట్‌లోనే ఎన్టీఆర్‌ కోసం ఓ సాలిడ్ యాక్షన్‌ థ్రిల్లర్‌ను రెడీ చేసిన శైలేష్… దిల్ రాజు సహకారంతో  యంగ్‌ టైగర్‌కు స్టోరీ కూడా వినిపించాడట. ఎన్టీఆర్‌ కూడా ఈ ‌ కథకు పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్.

అయితే ఎన్టీఆర్‌ ఓకే చెప్పినా..ఇప్పట్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ అయితే లేదు. ప్రజెంట్ ఆర్.ఆర్.ఆర్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు తారక్. ఆ తరువాత త్రివిక్రమ్‌తో కలిసి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అంటూ ఓ పొలిటికల్‌ డ్రామాకు ఓకే చెప్పారు. ఈ రెండు సినిమాలు పూర్తయితే గానీ ఎన్టీఆర్‌ నెక్ట్స్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ అయితే లేదు. మరి ఈ లోగా శైలేష్‌… ఫుల్‌ స్క్రిప్ట్‌తో తారక్‌ను మెప్పిస్తాడేమో చూడాలి.

Also Read :

హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పున:ప్రారంభం, తాగి వాహనం నడిపితే బ్యాండ్ బాజానే

కారులో ఉంచి దర్శనానికి.. ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరి, ఇంతలో హోంగార్డు ఏం చేశాడంటే..?

16 మంది అమ్మాయిలతో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తా, కెమెరాలు ఉన్నా ఫర్వాలేదు : వర్మ మార్క్ కామెంట్స్