అక్కడ షాపింగ్ చేయాలంటే మగాళ్లకే పర్మిషన్.. ఎందుకంటే..!

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. అప్పుడప్పుడు కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం బయటకు వస్తున్నారు.

అక్కడ షాపింగ్ చేయాలంటే మగాళ్లకే పర్మిషన్.. ఎందుకంటే..!

Edited By:

Updated on: Apr 25, 2020 | 3:40 PM

కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం లాక్ డౌన్‌లో ఉండిపోయింది. ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. అప్పుడప్పుడు కూరగాయలు, నిత్యావసర సరుకుల కోసం బయటకు వస్తున్నారు. పాలు ఇతరత్రా మందులు లాంటి అవసరమైన వాటి కోసమే బయట అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలో జపాన్‌లోని అతి పెద్ద నగరాల్లో మూడోదైన ఓ సిటీకి మేయర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిత్యావసర సరుకులు తీసుకురావడానికి కేవలం మగవారు మాత్రమే వెళ్లాలని స్పష్టం చేశారు.

ఎందుకంటే.. ఆయన ఓ లాజిక్ చెప్పారు. మగవారు సరుకులు కొనడానికి సూపర్ మార్కెట్‌కు వెళితే చకచకా తమకు కావాల్సిన వస్తువులు తీసుకుని వచ్చేస్తారని, అదే మహిళలు అయితే, ఎక్కువ సేపు షాపులో ఉంటారని లెక్కలు వేశారు. సహజంగా స్త్రీలు ఎక్కువసేపు షాపింగ్ చేస్తారనే నానుడిని ఆయన ఇక్కడ అప్లై చేశారు. అలా ఎక్కువ సేపు బయట ఉంటే కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని చెప్పారు. మగవారు షాపింగ్ కోసం వెళితే ఎక్కువసేపు సామాజిక దూరంపాటించాల్సిన పనిలేదు. ఎక్కువ సేపు బయట ఉండాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు.

Also Read: కరోనా వ్యాక్సీన్: యూకేలో హ్యూమన్ ట్రయల్స్ షురూ!