సైబర్ క్రైం పోలీస్ లను ఆశ్రయించిన జనసేనపార్టీ

|

Sep 15, 2020 | 7:06 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పార్టీ అధ్యక్షుడిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని..

సైబర్ క్రైం పోలీస్ లను ఆశ్రయించిన జనసేనపార్టీ
Follow us on

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ పార్టీ అధ్యక్షుడిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ విభాగం ఈ మేరకు హైదరాబాద్ పోలీస్ లను ఆశ్రయించింది. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రథం దహనం ఘటన పై ధర్మ పోరాట చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. పవన్ కళ్యాణ్ ఫోటోలను క్షుద్రపూజలు చేస్తున్న విధంగా చిత్రీకరించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ ప్రచారం చేస్తున్నారని పోలీసులకు విన్నవించారు. తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారి వివరాలను పోలీసులకు అందించామని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామని జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం మీడియాకు తెలిపారు.