పవన్ విశాఖ ర్యాలీతో.. పార్టీ బలోపేతం అయ్యేనా?

పవన్ విశాఖ ర్యాలీతో.. పార్టీ బలోపేతం అయ్యేనా?

జనసేన పార్టీని గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీలో తీవ్ర నైరాశ్యం చోటుచేసుకోవడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు చాలమంది పార్టీనుంచి బయటికి వెళ్లిపోయారు. క్యాడర్ ఉందో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న జనసేన పార్టీలో పవన్ ఒక్కరే అన్నీ చూసుకుంటున్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో పలువురు సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారు స్వతహాగా స్పందించడం లేదు. సుధీర్ఘకాలం రాజకీయాలు చేయడానికి […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 20, 2019 | 5:47 PM

జనసేన పార్టీని గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నారు. ఎన్నికల తర్వాత పార్టీలో తీవ్ర నైరాశ్యం చోటుచేసుకోవడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ సీనియర్లు చాలమంది పార్టీనుంచి బయటికి వెళ్లిపోయారు. క్యాడర్ ఉందో లేదో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న జనసేన పార్టీలో పవన్ ఒక్కరే అన్నీ చూసుకుంటున్నారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో పలువురు సీనియర్ నేతలు ఉన్నప్పటికీ వారు స్వతహాగా స్పందించడం లేదు. సుధీర్ఘకాలం రాజకీయాలు చేయడానికి వచ్చామని చెప్పుకునే పవన్ కళ్యాణ్.. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఆయనను ఏపీ ప్రజలు రాజకీయంగా గుర్తించలేకపోవడంతోనే ఈ పరాజయం ఎదురైనట్టుగా భావించాల్సి ఉంటుంది.

సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించి 2014లో ఇటు టీడీపీ, అటు బీజేపీలను పరోక్షంగా గెలిపించిన పవన్.. ప్రత్యక్షరాజకీయాల్లోకి వచ్చేసరికి ఫెయిల్ కావడం ఆయన అభిమానులను తీవ్ర నిరాశపరిచింది. ఆయన సభలకు వేలాదిమంది తరలిరావడంతో ఇది తన గెలుపునకు సంకేతమని భావించారు. కానీ సభలకు వచ్చిన వారి ఓట్లు వైసీపీకి పడటంతో పవన్ పార్టీకి వెయ్యి వోల్టుల విద్యుత్ షాక్ కొట్టినట్టయింది. వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేసిన జనసేనకు ఒకే ఒక్క అభ్యర్థి సాధించిన విజయం పట్ల.. పార్టీ నేతలనే అయోమయానికి గురిచేసింది.

పవన్ కళ్యాణ్.. టీడీపీకి అద్దెమైకు అంటూ అధికార వైసీపీ నేతలు ఎన్నోసార్లు విమర్శించారు. ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీ విధానాలను వదిలిపెట్టి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలుపై కసరత్తు చేస్తూ ఒక్కొ అంశాన్ని అమలు చేస్తుంటుండగానే.. జనసేన వాటిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఏపీ ప్రభుత్వ విధానాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇకపై ప్రత్యక్ష పోరాటాలకు రెడీ అవుతున్నారు. నవంబర్ 3న మధ్యాహ్నం 3 గంటలకు విశాఖలో భారీ ర్యాలీ జరపాలని పవన్ నిర్ణయించారు. అయితే ఈ ర్యాలీ ఎక్కడినుంచి ఎక్కడి వరకు చేపడతారనే దానిపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేయడానికి పవన్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఏర్పడ్డ విద్యుత్ సంక్షోభం, పోలవరంప ప్రాజెక్టు నిర్మాణం, వంటి ప్రధాన సమస్యలపై ప్రజలతో కలిసి ప్రభుత్వాన్ని నిలదీయాలని పవన్ కార్యాచరణ రెడీ చేస్తున్నారు. ఈ మేరకు ఆదివారం జనసేన పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ సీనియర్ నేతలు చర్చించారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్, తోట చంద్రశేఖర్, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, కందుల దుర్గేష్,ముత్తా శశిధర్ తదితరులు హాజరయ్యారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu