‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్

ధాన్యం సేకరణకు సంబంధించి ఎన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తున్నా మోసాలు ఆగడం లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తరుగు పేరిట అనుసరిస్తున్న విధానాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

Rajesh Sharma

|

May 01, 2020 | 7:28 PM

ధాన్యం సేకరణకు సంబంధించి ఎన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తున్నా మోసాలు ఆగడం లేదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తరుగు పేరిట అనుసరిస్తున్న విధానాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తరుగు పేరిట జరిగే మోసాలను తక్షణం అరికట్టాలని ఆయన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొనసాగుతున్న ధాన్యం సేకరణపై ముఖ్యమంత్రి శుక్రవారం మధ్యాహ్నం సంబంధిత మంత్రులు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కృష్ణాజిల్లాలో ధాన్యం సేకరిస్తున్న సమయంలో కొంత ధాన్యాన్ని తరుగు పేరిట మినహాయింపు చేస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహా మొత్తం పరిపాలనా యంత్రాంగం కృష్ణా జిల్లాలో ఉండగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు.

రైతాంగానికి మోసం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకూడదని, రైతులను మోసం చేస్తే ఒక్కరిని ఉపేక్షించే వద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. నడిరోడ్డు మీద పంట దిగుబడుల వేసి వదిలేయడమో, తగుల బెట్టడమో చేసిన ఉదంతాలు గత ప్రభుత్వ హయాంలో కనిపించేవని, ప్రస్తుతం అలాంటి సంఘటనలు కనిపించడానికి వీలులేదని సీఎం అన్నారు. చీనీ, అరటి, టమోటా, మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్లపై దృష్టి సారించాలని హార్టికల్చర్ అధికారులను జగన్ ఆదేశించారు.

ఏ సంవత్సరానికి.. ఆ సంవత్సరం మార్కెటింగ్ సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు వ్యవసాయ సలహా కమిటీలను నియమించాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. రైతు భరోసా కేంద్రాలకు ఇంటర్నెట్, విద్యుత్ సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రైతులు ఏ పంట వేస్తే దిగుబడి సమయంలో మంచి ఆదాయం వస్తుందో పరిశోధన చేసి రైతాంగానికి సూచించాలని సీఎం చెప్పారు.

పంటలు వేస్తున్నప్పుడే ఆ పంటకు కనీస మద్దతు ధర ప్రకటించి, దిగుబడి వచ్చే నాటికి ఆ ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనివల్ల రైతుల్లో విశ్వాసం పెరుగుతుందని అన్నారు. పంటలను ఈ-క్రాపింగ్ చేయడం, రైతు భరోసా కేంద్రాలను వినియోగించి దిగుబడులను కొనుగోలు చేయడం వంటి పనులన్నీ వ్యవస్థీకృతంగా సాగిపోవాలని ముఖ్యమంత్రి అన్నారు.

హైదరాబాదులో ఇప్పుడు ఈ ప్రాంతాలే కీలకం

ఉద్ధవ్ థాకరేకు ఎన్నికల కమిషన్ గుడ్ న్యూస్

లింగంపల్లి నుంచి తొలి స్పెషల్ రైలు.. ఎక్కడికంటే?

3 రోజుల్లో పీఎఫ్ సొమ్ము.. థాంక్స్ టు మోదీజీ!

డాక్టర్లపై అర్దరాత్రి దాడి.. బైకు దగ్ధం 

గ్రీన్ జోన్లలోనే సడలింపులు.. అందుకే వర్గీకరణ

‘తరుగు’ మోసాలపై సీఎం సీరియస్  

హైరిస్క్‌లో 4 వేల మంది.. తాజా లెక్కలతో సీఎం షాక్

ప్రత్యేక రైళ్లకు ప్రత్యేక ఆంక్షలు.. కేంద్రం భారీ కసరత్తు 

Big Breaking మరో రెండు వారాలు లాక్ డౌన్ 

రెడ్ జోన్ల చుట్టూ డీమార్కేషన్.. నిఘాకు ప్రత్యేక వ్యూహం  

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu