ట్విట్టర్‌ను కొనేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పాత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే సీఈఓ, సీఎఫ్‌ఓ సహా ఇతర కీలక పదవుల్లో ఉన్న వారిని మస్క్ క ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంపై దృష్టి సారించారు. శనివారం నుంచే మస్క్ ఉద్యోగుల తొలగింపు ప్రణాళికల్ని అమలు చేయడం ప్రారంభించారు. దీనిపై మేనేజర్లకు కూడా ఆయన ఆదేశాలు పంపించారు. నట్లు సమాచారం. ట్విట్టర్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉందని మస్క్ ముందు నుంచి కచ్చితమైన అభిప్రాయంతో ఉన్నారు. దాదాపు 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తామని ఆయన బ్యాంకర్లకు చెప్పినట్లు తెలుస్తోంది.అయితే, అందులో వాస్తవం లేదని తర్వాత మస్క్ కొట్టిపారేశారు.
కంటెంట్‌పరమైన విధానాలకు సంబంధించి ఓ మండలిని ఏర్పాటు చేస్తామని మస్క్ తెలిపారు. ‘కంటెంట్ మోడరేషన్ కౌన్సిల్’ ఏర్పాటు తర్వాతే విధానాల్లో మార్పులు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు కంటెంట్ మార్పులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అలాగే కొంతమంది ప్రముఖుల ఖాతాల్ని పునరుద్ధరించడంపైనా మండలి ఏర్పాటు తర్వాతే నిర్ణయం ఉంటుందని తెలిపారు.
మరోవైపు ట్విటర్ సహ-వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్ డోర్సే మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తీసుకొస్తున్నారు. కొత్త వేదికకు ‘బ్లూస్కై’గా పేరు పెట్టారు. ప్రస్తుతం దీన్ని ప్రైవేటుగా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు బ్లాగ్‌లో డోర్సే స్వయంగా తెలిపారు. ఒకసారి ఈ పరీక్షలు పూర్తయితే, దాని పబ్లిక్ బీటా టెస్టింగ్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. తొలుత ఈ ప్రాజెక్టును బ్లూస్కై పేరుతో ప్రారంభించామని.. చివరకు కంపెనీ పేరు కూడా దాన్నే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బ్లూస్కై పేరు విస్తృతమైన అవకాశాలకు సూచిక అని వివరించారు. సామాజిక మాధ్యమాల వెనుక ఉన్న అసలు లక్ష్యాన్ని, యూజర్ల డేటాను హస్తగతం చేసుకోవాలనుకునేవారికి బ్లూస్కై పోటీ ఇస్తుందని డోర్సే తెలిపారు. పరోక్షంగా ట్విటర్‌కు పోటీగానే ఆయన దీన్ని తీసుకొస్తున్నట్లుగా టెక్ నిపుణుల్లో విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..