Kane Williamson: ప్రపంచకప్ గెలవకపోయినా.. మనసులను గెలుచుకున్నాడు..

|

Jul 15, 2020 | 1:22 AM

ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలిచినా.. విలియమ్సన్ ఎందరో మనసులను గెలుచుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలుచుకుని సరిగ్గా ఏడాది అయింది.

Kane Williamson: ప్రపంచకప్ గెలవకపోయినా.. మనసులను గెలుచుకున్నాడు..
Follow us on

Kane Williamson Iconic Smile: అతి పెద్ద ఐసీసీ టోర్నమెంట్.. ఒక్క అడుగు దూరంలో వరల్డ్ కప్.. మొదటిసారి ఓడిపోయినా.. రెండోసారి దక్కించుకుంటున్నామనే ఆనందం.. అయితే కొద్దిసేపటికే అదంతా నీరుగారిపోయింది. కష్టపడిన దానికి ఫలితం లేకుండాపోయింది. అయినా నిరుత్సాహపడలేదు.. మొహంపై చెరగని చిరునవ్వుతో ప్రత్యర్ధులతో కరచాలనం చేశాడు. మీకు గుర్తొచ్చే ఉంటుంది.. అతడెవరో కాదు.. మన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలిచినా.. విలియమ్సన్ ఎందరో మనసులను గెలుచుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రపంచకప్ గెలుచుకుని సరిగ్గా ఏడాది అయింది.

ఇంగ్లీష్ జట్టు తొలిసారిగా ప్రపంచకప్ గెలిచి ఏడాది పూర్తయింది. క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలవడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. గతేడాది లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌పై ఉత్కంఠబరితంగా సాగిన పోరులో ఇంగ్లాండ్ జట్టు అనూహ్యంగా విజయం సాధించి ప్రపంచకప్‌ను దక్కించుకుంది. ముందుగా కివీస్ 241/8 రన్స్ చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ఆ స్కోరును సమయం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక ఆ సూపర్ ఓవర్ కూడా మంచి రసవత్తరంగా సాగగా.. చివరికి బంతికి అది కాస్తా టైగా ముగియడంతో.. బౌండరీలు కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. దీనితో కివిస్ రెండోసారి ప్రపంచకప్‌ను చేజార్చుకుంది. 2015లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓడిన సంగతి తెలిసిందే.