ధోని కెరీర్ ఓ ప్రశ్నార్ధకం.. పక్కన పెట్టారా.? పీఠమెక్కిస్తారా.?

| Edited By: Anil kumar poka

Aug 31, 2019 | 2:39 PM

వరల్డ్ బెస్ట్ అండ్ కూల్ కెప్టెన్ ధోని… మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 2004లో నేషనల్ సైడ్‌లోకి వచ్చిన ధోని.. 2007లో వన్డే సారధ్య బాధ్యతలు.. 2008లో టెస్ట్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి.. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించాడు.  ఒక్కోసారి జట్టు క్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు ఒకే ఒక్కడుగా చివరి వరకు నిలిచి.. విజయతీరాలకు […]

ధోని కెరీర్ ఓ ప్రశ్నార్ధకం.. పక్కన పెట్టారా.? పీఠమెక్కిస్తారా.?
Follow us on

వరల్డ్ బెస్ట్ అండ్ కూల్ కెప్టెన్ ధోని…

మహేంద్రసింగ్ ధోని.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియాకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. 2004లో నేషనల్ సైడ్‌లోకి వచ్చిన ధోని.. 2007లో వన్డే సారధ్య బాధ్యతలు.. 2008లో టెస్ట్ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టి.. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించాడు.  ఒక్కోసారి జట్టు క్లిష్టపరిస్థితిలో ఉన్నప్పుడు ఒకే ఒక్కడుగా చివరి వరకు నిలిచి.. విజయతీరాలకు చేర్చేవాడు. అతని సారధ్యంలో ఎంతోమంది యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ధోని కెప్టెన్సీలోనే రాటు తేలేడని చెప్పడంలో విడ్డూరం ఏమి లేదు.

వన్డే ప్రపంచకప్‌లో తడబాటు…

ఇది ఇలా ఉండగా ధోని కొద్దికాలంగా ఫామ్ కోల్పోయాడు. ఒంటి చేత్తో గెలిపించిన అతడు.. ఇప్పుడు టీమ్‌కు భారంగా మారాడని కొందరి భావన. అయితే ధోని ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానులు కూడా అతడి అనుభవం జట్టుకు ఎంతో అవసరమని అంటున్నారు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కూడా ధోని వల్ల పలు మ్యాచులు ఓడిపోయామని.. అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తే మంచిదని నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.

దేశ సేవలో మిస్టర్ కూల్ ధోని…

మరోవైపు ధోని ప్రపంచకప్ అనంతరం కొద్దిరోజులు ఆటకు ఫుల్‌స్టాప్ పెట్టి.. దేశానికి సేవ చేయడానికి ఆర్మీలో చేరాడు. ఇక ఆ సర్వీస్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో ఆడే టీ20 సిరీస్‌కు ధోనిని ఎంపిక చేస్తారని అందరూ భావించినా.. అనూహ్యంగా అతడు అందుబాటులో లేడని.. అంతేకాకుండా యువ వికెట్ కీపర్లను తీర్చిదిద్దానికి ఛాన్సులు ఇస్తున్నామని సెలెక్టర్లు అన్నారు. అయితే ధోనిని తాము పక్కనపెట్టలేదని.. అతని అనుభవం జట్టుకూ.. అంతకు మించి కెప్టెన్ కోహ్లీకి ఎంతో అవసరమని.. గ్రౌండ్‌లో ధోని ఇచ్చే సూచనలు విరాట్‌కు ఎంతో ఉపయోగపడతాయని వారు అన్నారు. వారి వాదనను ఎంత విన్నా.. గతంలో టీమిండియా మాజీ క్రికెటర్ల మాదిరిగానే ధోని కూడా ఇప్పుడు కెరీర్ చివరి ఫేజ్‌ను అనుభవిస్తున్నాడని అభిమానులు అంటున్నారు.

రిటైర్మెంట్‌పై ఎన్నో ప్రచారాలు…

కొద్దిరోజుల్లో ఆయన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించినా ఆశ్చర్యపోనక్కరలేదని వారి వాదన. అటు ధోనిపై ఇటీవల మీడియాలో పలు రూమర్లు కూడా ప్రచారం జరుగుతున్నాయి. కొందరు అమెరికాలో ఉన్నాడని.. అందుకే సఫారీ టూర్‌కు దూరమయ్యాడని అంటుంటే.. మరికొందరు ధోని అప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడని చెబుతున్నారు. బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి ధోని నిర్మాతగా మారబోతున్నాడని సమాచారం. త్వరలోనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయనున్నాడని వినికిడి. ఏది ఏమైనా ఓ లెజెండరీ క్రికెటర్‌ను ఇలా పక్కన పెట్టడం సరికాదని క్రికెట్ అభిమానులు అంటున్నారు.