IPL 2020: ప్రపంచకప్ తర్వాత అంతటి మెగా టోర్నమెంట్ ఏదైనా ఉందంటే.? అది ఖచ్చితంగా ఐపీఎల్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ టోర్నీ ఆఖరి బంతి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగడమే కాకుండా.. ప్రతీ మ్యాచ్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఈ లీగ్ ద్వారా ఫ్యాన్స్ డబుల్ మజా పొందుతున్నారు. అందుకే దీనికి క్రికెట్‌లో అత్యంత ధనిక లీగ్‌గా విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఇక తాజాగా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ పలు రికార్డులు బ్రేక్ చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి 23 శాతం మందికి పైగా టీవీల ద్వారా ఈ లీగ్‌ను వీక్షించారని అఫీషియల్ బ్రాడ్‌కాస్టింగ్ పార్టనర్ స్టార్ ఇండియా ప్రకటించింది.
మొత్తం ఐదు ప్రాంతీయ భాషల్లో ప్రసారమైన ఈ లీగ్‌ను దాదాపు 31.57 మిలియన్ వీక్షకులు చూశారని.. అందులో మహిళలు 24 శాతం, పిల్లల్లో 20 శాతం ఆదరణ పెరిగిందని వెల్లడించింది. ప్రపంచంలో అత్యుత్తమ లీగ్ ఐపీఎల్‌ను.. ఎలాంటి అవాంతరాలు లేకుండా బీసీసీఐ యూఏఈలో విజయవంతంగా నిర్వహించిందని స్టార్ ఇండియా ప్రధానాధికారి సంజోగ్ గుప్తా అన్నాడు. కాగా, కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. అభిమానులకు అనుమతి లేకపోవడంతో ఈ సీజన్‌ను అత్యధిక మంది వీక్షకులు టీవీలు, ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించారు.
Also Read:
ఆ ఐదుగురి ప్లేయర్స్‌పై ఆర్సీబీ కన్ను.. వచ్చే ఐపీఎల్‌కు బెంగళూరు జట్టులో సన్‌రైజర్స్ ఆటగాడు.?
వచ్చే ఐపీఎల్‌కు చెన్నై జట్టు భారీ మార్పులు.. ఆ ఐదుగురిపై వేటు తప్పదు.. లిస్టులో ధోని.!