ముంబై ఇండియన్స్ ఫైనల్‌ వెళ్లిందంటే.!

ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ కన్సిస్టెంట్‌ టీం అంటే ఠక్కున ముంబై ఇండియన్స్ గుర్తుకువస్తుంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై మరోసారి టైటిల్

ముంబై ఇండియన్స్ ఫైనల్‌ వెళ్లిందంటే.!

Updated on: Nov 05, 2020 | 11:04 PM

IPL 2020: ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ కన్సిస్టెంట్‌ టీం అంటే ఠక్కున ముంబై ఇండియన్స్ గుర్తుకువస్తుంది. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై మరోసారి టైటిల్ గెలవాలని ఉత్సాహంగా ఉంది. ఢిల్లీతో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కూడా అదరగొడుతోంది. కాగా, ఫైనల్స్‌లో ముంబై ఇండియన్స్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 5 సార్లు ఫైనల్‌కు చేరిన ముంబై నాలుగు సార్లు విజేతగా నిలిచింది. 2010లో తొలిసారిగా ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుసగా 2013, 2015, 2017, 2019 సీజన్లలో గెలిచి ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు కూడా ముంబై అదే ఊపుతో ఐదు టైటిల్ ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతోంది.

Also Read: ఐపీఎల్ 2020: హిట్‌మ్యాన్‌ ఖాతాలో చెత్త రికార్డు..