స్మిత్, శాంసన్‌ల అర్ధ సెంచరీలు.. చెన్నై ముందు భారీ టార్గెట్..

|

Sep 22, 2020 | 9:35 PM

ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 216 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరంభంలో యశస్వి జైస్వాల్ త్వరగా పెవిలియన్ చేరినా..

స్మిత్, శాంసన్‌ల అర్ధ సెంచరీలు.. చెన్నై ముందు భారీ టార్గెట్..
Follow us on

ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 217 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరంభంలో యశస్వి జైస్వాల్ త్వరగా పెవిలియన్ చేరినా.. ఆ తర్వాత వచ్చిన సంజూ శాంసన్ మెరుపులు మెరిపించాడు. కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి చెన్నై స్పిన్నర్లకు చుక్కులు చూపించాడు. ముఖ్యంగా శాంసన్.. పియూష్ చావ్లా బౌలింగ్‌ను ఉతికారేయడమే కాకుండా.. 19 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సెంచరీ దశగా అడుగులు వేస్తున్న శాంసన్‌(74)ను ఎనిగిడి ఔట్ చేశాడు. ఒక దశలో రాయల్స్ స్కోర్ బోర్డ్ 12 రన్ రేట్‌తో దూసుకుపోతుండగా.. శాంసన్ ఔట్‌తో అది కాస్త మందగించింది. (IPL 2020)

అయితే కెప్టెన్ స్టీవ్ స్మిత్(69) యాంకర్ రోల్ పోషిస్తూ చివరి వరకు జట్టును నడిపించాడు, చివరి ఓవర్‌లో ఆర్చర్(27) మెరుపులు తోడవ్వడంతో రాజస్థాన్ టీం స్కోర్ 200 మార్క్ సునాయాసంగా దాటేసింది. రాజస్థాన్ రాయల్స్ మొత్తంగా 20 ఓవర్లలో 216 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ 17 సిక్స్‌లు కొట్టగా.. దీనిలో 9 సిక్స్‌లు శాంసన్ బ్యాట్‌ నుంచి వచ్చాయి. కాగా, చెన్నై బౌలర్లలో కరన్ మూడు వికెట్లు పడగొట్టగా.. చావ్లా, ఎంగిడి, చాహర్ ఒక్కో వికెట్ తీశారు. రవీంద్ర జడేజా మాత్రం బౌలింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.