రోహిత్ వెర్సస్ వార్నర్.. ముంబై జోరును హైదరాబాద్ అడ్డుకోగలదా!

|

Oct 04, 2020 | 12:52 PM

ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ షార్జా వేదికగా మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. జోరు మీదున్న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలబడనుంది.

రోహిత్ వెర్సస్ వార్నర్.. ముంబై జోరును హైదరాబాద్ అడ్డుకోగలదా!
Follow us on

ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ షార్జా వేదికగా మరో ఆసక్తికరమైన పోరుకు తెరలేవనుంది. జోరు మీదున్న ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలబడనుంది. ఇప్పటివరకూ హైదరాబాద్, ముంబై తలో నాలుగు మ్యాచ్‌లు ఆడి చెరో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఇరు జట్లు తమ తమ గత మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్.. చెన్నైపై 7 పరుగుల తేడాతో విజయం సాధించగా, పంజాబ్‌పై 48 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. ఇక ఇరు జట్లు ఓవరాల్‌గా 14సార్లు తలపడగా హైదరాబాద్ 7 మ్యాచ్‌లు, ముంబై 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్‌లో ముంబై గత జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉండగా, హైదరాబాద్ మాత్రం భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఒక మార్పు చేసే అవకాశం ఉంది. (IPL 2020)

రోహిత్ వెర్సస్ వార్నర్..

ఈ మ్యాచ్‌లో రోహిత్-వార్నర్‌ల బ్యాటింగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ముంబై కెప్టెన్, హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ గత రెండు మ్యాచ్‌ల నుంచి తన అద్భుత ఫామ్‌ను కొనసాగుతుండగా, వార్నర్ మాత్రం ఇంకా టచ్‌లోకి రాలేదు. అసలే షార్జా వేదిక అంటేనే సిక్సర్ల వర్షం కురుస్తుంది. దాంతో ఈ మ్యాచ్‌ ద్వారా తన మునుపటి ఫామ్‌ను అందుకోవాలని వార్నర్ భావిస్తున్నాడు. ఇదిలా ఉంచితే హైదరాబాద్‌లో బెయిర్‌స్టో కూడా తన ఫామ్‌ను అందుకోవాలి. ఈ జట్టుకు మిడిల్‌లో కేన్ విలియమ్సన్ కొండంత అండ అని చెప్పాలి. అలాగే యంగ్ ప్లేయర్స్ ప్రియం గార్గ్, అభిషేక్ శర్మలతో చక్కటి బ్యాటింగ్ లైనప్ హైదరాబాద్ సొంతం. డికాక్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చి.. హార్దిక్, సుర్యకుమార్ యాదవ్, పొలార్డ్‌లు మరోసారి తన సత్తాను చాటితే ముంబైకి విజయం ఈజీగా అందుతుంది. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికరపోరు జరిగే అవకాశం ఉంది.

రెండు జట్లు చివరి ఐదు మ్యాచ్‌లు చూస్తే..

  • ముంబై సూపర్ ఓవర్‌లో గెలిచింది..
  • ముంబై 40 పరుగుల తేడాతో విజయం
  • హైదరాబాద్ 31 పరుగులతో విజయం
  • హైదరాబాద్ ఒక్క వికెట్‌తో గెలిచింది
  • ఎస్‌ఆర్‌హెచ్‌ 7 వికెట్లు తేడాతో గెలిచింది