క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ డేట్స్ ఫైనల్..

ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్యలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ పోస్ట్ పోన్ చేయడంతో.. ఆ విండోలో ఐపీఎల్ 13వ ఎడిషన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇప్పుడు తాజాగా ఈ లీగ్ ఫైనల్ డేట్స్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ డేట్స్ ఫైనల్..

Updated on: Jul 24, 2020 | 3:53 PM

IPL 2020 Dates Finalized: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్యలో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ పోస్ట్ పోన్ చేయడంతో.. ఆ విండోలో ఐపీఎల్ 13వ ఎడిషన్‌ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇప్పుడు తాజాగా ఈ లీగ్ ఫైనల్ డేట్స్ ఖరారయ్యాయి. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ ప్రకటించారు. ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ సమావేశం తర్వాత అధికారికంగా ప్రకటిస్తామన్నారు. ఈ టోర్నీ యూఏఈలో సెప్టెంబర్ 19న ప్రారంభం కానుండగా.. 51 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్ ఫైనల్ నవంబర్ 8న నిర్వహిస్తారు.

లీగ్‌లో పాల్గొంటున్న ఎనిమిది జట్లు ఆగష్టు 20 కల్లా యూఏఈకి చేరుకోనున్నాయి. వచ్చే వారం జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా.. చైర్మన్ ముందుగానే డేట్స్ అనౌన్స్ చేశారు. ఇక ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను తీసుకెళ్లేందుకు ఛార్టెడ్ ఫ్లైట్స్, హోటల్ బుకింగ్ ఏర్పాట్లును ముమ్మరం చేస్తున్నాయి. కాగా, ఐపీఎల్‌లో పాల్గొనాల్సిన తమ ఆటగాళ్ళందరికీ ఎన్‌ఓసీ జారీ చేస్తామని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఆరోగ్యం విషయంలో మాత్రం ఆటగాళ్లే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి నెల రోజుల హోం క్వారంటైన్..

ఏపీలో కరోనా విజృంభణ.. ఆ జిల్లాలో 31 వరకు లాక్‌డౌన్‌..!