IPL 2020: ప్రపంచంలోనే అత్యధిక ధనిక లీగైన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడాలనుకున్న యూఏఈ ప్లేయర్ అలీఖాన్ ఆశలు ఆవిరి అయ్యాయి. గాయం కారణంగా అతడి లీగ్‌లో ఒక్క మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ”కేకేఆర్ బౌలర్ హ్యారీ గర్నీ స్థానంలో అలీఖాన్‌ను జట్టులోకి తీసుకుంది కోల్‌కతా ఫ్రాంచైజీ. అమెరికా నుంచి ఈ టోర్నీలో చోటు దక్కించుకున్న తొలి ఆటగాడు ఇతడే. అయితే దురదృష్టవశాత్తు అతడికి గాయం కావడంతో పూర్తి టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చిందని కేకేఆర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, పాకిస్థాన్‌లో పుట్టిన అలీఖాన్.. పెరిగిందంతా అమెరికాలోనే. 2016లో యూఏఈ జాతీయ జట్టు తరపున బరిలోకి దిగిన అలీ.. ఇప్పటిదాకా 36 టీ20 మ్యాచులు ఆడి.. 38 వికెట్లు పడగొట్టాడు.
Also Read:
ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.!
అభ్యర్థులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. దరఖాస్తుకు మరోసారి అవకాశం.!
AP Eamcet 2020: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల ఎప్పుడంటే..!
యువ నటుడికి ప్రమాదం.. ఐసీయూలో చికిత్స..
షాకింగ్ న్యూస్: దేశంలో 16 నిమిషాలకు ఒక రేప్.. NCRB సర్వే సంచలనం!