క్రీడాకారులను వదలని కరోనా

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మయ మ్మారి ఎవరిని వదలడంలేదు. సామాన్యులతో పాటు క్రీడాకారులు సైతం రాకాసి బారినపడుతున్నారు.

క్రీడాకారులను వదలని కరోనా

Updated on: Sep 04, 2020 | 10:49 AM

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మయ మ్మారి ఎవరిని వదలడంలేదు. సామాన్యులతో పాటు క్రీడాకారులు సైతం రాకాసి బారినపడుతున్నారు. మొన్న వినేశ్‌ ఫొగట్‌..నేడు మరో స్టార్‌ రెజ్లర్‌ దీపక్‌ పునియా. కరోనా వైరస్‌ క్రీడాకారులపైనా ప్రతాపం చూపుతోం ది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత దీపక్‌ పునియా, మరో ఇద్దరు సీనియర్‌ రెజ్లర్లు పాజిటివ్‌గా తేలినట్టు భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) గురువారం వెల్లడించింది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన దీపక్‌తోపాటు నవీన్‌ , క్రిషన్‌కు కొవిడ్‌ సోకిందని సాయ్ అధికారులు వెల్లడించారు. సొనెపట్‌లో జాతీయ శిబిరంలో ఉన్న వీరిని ముందుజాగ్రత్తగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాట్లు సాయ్‌ తెలిపింది. అలాగే వారి కాంటాక్ట్ లో ఉన్నవారికి కూడా వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.