ఉగ్రదాడుల ఘటనకు 2 గంటల ముందే శ్రీలంకను హెచ్చరించిన భారత్

| Edited By:

Apr 23, 2019 | 9:44 PM

శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. చర్చిలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ పేలుళ్లలో 321 మంది మృతిచెందారు… 500 మంది గాయపడ్డారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని చర్చిలో ప్రార్థనలకు వచ్చినవారే లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు. మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు జరిగినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకునే ముందే తీవ్రవాదులు దాడి చేయబోతున్నట్లు శ్రీలంక నిఘా అధికారులను భారత గూఢచార అధికారులు హెచ్చరించారు. ఎటువంటి సాక్ష్యం […]

ఉగ్రదాడుల ఘటనకు 2 గంటల ముందే శ్రీలంకను హెచ్చరించిన భారత్
Follow us on

శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. చర్చిలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ పేలుళ్లలో 321 మంది మృతిచెందారు… 500 మంది గాయపడ్డారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని చర్చిలో ప్రార్థనలకు వచ్చినవారే లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు. మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు జరిగినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

ఈ ఘటన చోటుచేసుకునే ముందే తీవ్రవాదులు దాడి చేయబోతున్నట్లు శ్రీలంక నిఘా అధికారులను భారత గూఢచార అధికారులు హెచ్చరించారు. ఎటువంటి సాక్ష్యం లేకుండానే ఐసిస్ మంగళవారం ఈ దాడులకు బాధ్యత వహించింది.

మొదటి దాడికి రెండు గంటల ముందు భారత నిఘా అధికారులు శ్రీలంక ప్రతినిధులను సంప్రదించారు.శనివారం రాత్రి కూడా భారత అధికారుల నుంచి ఒక హెచ్చరిక వచ్చిందని శ్రీలంక వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 4… ఏప్రిల్ 20 న కూడా శ్రీలంక నిఘా ఏజెంట్లకు ఇదే విధమైన సందేశాలు ఇవ్వబడ్డాయి. అయితే శ్రీలంక ప్రభుత్వం… భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి కూడా ఎటువంటి స్పందన లభించలేదు.