వన్డే సిరీస్: భారత్ ప్లాప్ షో.. గట్టెక్కిన కివీస్..

|

Feb 05, 2020 | 4:05 PM

India Vs New Zealand: కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 50 ఓవర్లకు 347 పరుగులు భారీ స్కోర్‌ను సాధించింది. శ్రేయస్ అయ్యర్ (103, 107 బంతుల్లో; 11×4, 1×6) సెంచరీతో అదరగొట్టగా.. కేఎల్‌ రాహుల్ (88, 64 బంతుల్లో; 3×4,6×6), విరాట్ కోహ్లీ (51, 63 బంతుల్లో; 6×4) అర్ధశతకాలతో విజృంభించారు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు […]

వన్డే సిరీస్: భారత్ ప్లాప్ షో.. గట్టెక్కిన కివీస్..
Follow us on

India Vs New Zealand: కివీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ పరాజయం పాలైంది. హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 50 ఓవర్లకు 347 పరుగులు భారీ స్కోర్‌ను సాధించింది. శ్రేయస్ అయ్యర్ (103, 107 బంతుల్లో; 11×4, 1×6) సెంచరీతో అదరగొట్టగా.. కేఎల్‌ రాహుల్ (88, 64 బంతుల్లో; 3×4,6×6), విరాట్ కోహ్లీ (51, 63 బంతుల్లో; 6×4) అర్ధశతకాలతో విజృంభించారు. కివీస్ బౌలర్లలో సౌథీ రెండు వికెట్లు తీయగా.. గ్రాండోమ్, సోధి చెరో వికెట్ పడగొట్టారు.

టీమిండియా నిర్దేశించిన 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కివీస్‌కు ఓపెనర్లు మార్టిన్ గప్తిల్(32), నికోలస్(78) అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. ఇక మిడిల్ ఆర్డర్‌లో దిగిన రాస్ టేలర్(109*) ఎప్పటిలానే తన మార్క్‌ను చూపిస్తూ సెంచరీ సాధించడమే కాకుండా చివరి వరకు అజేయంగా నిలిచి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అటు కెప్టెన్ లాథామ్(69) కూడా అదరగొట్టే ఇన్నింగ్స్ ఆడటంతో కివీస్ మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించింది. భారత బౌలర్లలో కుల్దీప్ రెండు వికెట్లు తీయగా.. ఠాకూర్, షమీలు చెరో వికెట్ పడగొట్టారు. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 8వ తేదీన జరగనుంది.