India Vs Australia Live Score:ఆస్ట్రేలియా భారత్ ల మధ్య సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇండియా 244 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియాకు 94 పరుగుల ఆధిక్యం లభించింది. మూడో రోజు ఉదయం రెండు వికెట్లను 96 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్ కు మరో 148 పరుగులు చేసి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఉదయం ఇన్నింగ్స్ ను ప్రారంభించిన పుజారా, రహానేలు 21 పరుగులు జోడించారు. అనంతరం రహానే ఔటయ్యాడు. ఇక పూజారా 176 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 5 బౌండరీలున్నాయి. అనంతరం రిషబ్ పంత్ 36పరుగుల వద్ద అవుట్ అవ్వగా.. వెంటనే పూజారా వెనుదిరిగాడు. అనంతరం భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. చివర్లో రవీంద్ర జడేజా ఒక్కడే ధాటిగా 28 పరుగులు చేశాడు. దీంతో భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 100.4 ఓవర్లలో 244 పరుగులు చేసింది. కంగారూ బౌలర్లలో కమిన్స్ 4, హేజిల్‌వుడ్ 2, స్టార్క్ 1 వికెట్ తీశారు. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 338 రన్స్ చేసింది.
Also Read:
ప్రపంచం దేశాల్లో కొనసాగుతున్న కరోనా మృత్యుఘోష… 19 లక్షలు దాటిన మరణాలు