India Vs Australia 2020: ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు..

India Vs Australia 2020: బ్రిస్బేన్ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ...

India Vs Australia 2020: ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు..

Updated on: Jan 15, 2021 | 11:54 AM

India Vs Australia 2020: బ్రిస్బేన్ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌(108) అద్భుత శతకంతో అదరగొట్టాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్(1) ఔట్ అయ్యాక బరిలోకి దిగిన లబూషేన్.. స్మిత్‌(36)తో కలిసి మూడో వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం.. అలాగే వేడ్‌(45; 87 బంతుల్లో 6×4)తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి నటరాజన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ కెప్టెన్ పైన్(0), గ్రీన్(10)తో క్రీజులో ఉన్నారు. ఇక 70 ఓవర్లు ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.