India Vs Australia 2020: టీమిండియాతో జరగబోయే మూడో టెస్టుకు ముందు ఆతిధ్య ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా పేస్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్ జట్టుకు దూరమయ్యాడు. ప్రాక్టిస్ సెషన్‌లో అతడి పక్కటెముకులకు భారీగా గాయం కాగా.. ఫిజియోలు కొద్ది వారాల పాటు విశ్రాంతి అవసరమని తేల్చి చెప్పారు.
అటు భారత్‌తో జరిగిన రెండు టెస్టులలోనూ ప్యాటిన్సన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక నాలుగో టెస్టుకు ముందు ప్యాటిన్సన్ ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ కావాల్సి ఉంది. కాగా, మొదటి రెండు టెస్టుల్లో కొనసాగిన పేస్ త్రయం పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌లను మూడో టెస్టులోనూ కొనసాగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది.