India Vs Australia 2020: టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో రెండో టెస్టుకు నాయకత్వం వహిస్తున్న అజింక్య రహానె(70) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ సెంచరీకి దగ్గర అవుతున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్(29) ఔటయ్యాక ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(12)తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 36/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 195ని అధిగమించింది. ప్రస్తుతం 75 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 223 పరుగులు చేసింది. క్రీజులో రహానే(71), జడేజా(20)తో ఉన్నారు. భారత్ 28 పరుగుల ఆధిక్యంతో ఆటను కొనసాగిస్తోంది.
India’s lead goes into double figures #AUSvIND https://t.co/IvseUVBLx9
— cricket.com.au (@cricketcomau) December 27, 2020