దేశంలో కరోనా మలి విడత ప్రబలుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక రూట్లలో మాత్రమే విమానాలను నడపనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) గురువారం వెల్లడించింది. కొవిడ్-19కు సంబంధించిన ప్రయాణ, వీసా పరిమితులు పేరుతో తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. విమాన ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు.
అయితే, జూన్ 26న విడుదల చేసిన సర్క్యులర్‌కు మార్పులు చేస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది డీజీసీఏ. అలాగే, అన్ని అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానాలను డిసెంబర్ 31 వరకు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది . డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన విమానాలు, కార్గో సర్వీసులకు ఈ నిబంధనలు వర్తించవని తెలిపింది.
— DGCA (@DGCAIndia) November 26, 2020