ఫేస్ బుక్ లో ఇస్లాం వ్యతిరేక ప్రచారం, బ్యాన్ చేయాలన్న ఇమ్రాన్ ఖాన్

| Edited By: Anil kumar poka

Oct 26, 2020 | 2:10 PM

ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఇస్లాం వ్యతిరేక ప్రచారం సాగుతోందని, దీన్ని బ్యాన్ చేయాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్....

ఫేస్ బుక్ లో ఇస్లాం వ్యతిరేక ప్రచారం, బ్యాన్ చేయాలన్న ఇమ్రాన్ ఖాన్
Follow us on

ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో ఇస్లాం వ్యతిరేక ప్రచారం సాగుతోందని, దీన్ని బ్యాన్ చేయాలని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్…. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బెర్గ్ కి రాసిన లేఖలో కోరారు. ఈ లేఖను ఇమ్రాన్ ప్రభుత్వం ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ విధమైన సామాజిక మాధ్యమాల్లో ఇస్లామోఫోబిక్ కంటెంట్ పెరిగిపోతోంది… ఇది తీవ్రవాదాన్ని, హింసను రెచ్చగొడుతోంది అని ఇమ్రాన్ పేర్కొన్నారు.  తక్షణమే ఈ విధమైన ప్రచారాన్ని నిషేధించాలన్నారు.