మోదీని అభినందించిన ఇమ్రాన్

| Edited By:

May 26, 2019 | 7:15 PM

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది మరోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రమోదీకి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేశారు. అనంతరం ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఫలితాలు వచ్చిన వెంటనే ట్విట్టర్‌ ద్వారా మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ఇమ్రాన్.. మరోసారి స్వయంగా ఫోన్ చేసి తన ఆత్మీయతను చాటుకున్నారు. పొరుగు దేశాల మధ్య ఉండాల్సిన దౌత్యాన్ని గుర్తు చేస్తూ పాకిస్తాన్‌, ఇండియాలలో ఉన్న పేదరికంపై సంయుక్తంగా పోరాడాల్సిన ఆవశ్యకతను […]

మోదీని అభినందించిన ఇమ్రాన్
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొంది మరోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నరేంద్రమోదీకి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫోన్ చేశారు. అనంతరం ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఫలితాలు వచ్చిన వెంటనే ట్విట్టర్‌ ద్వారా మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ఇమ్రాన్.. మరోసారి స్వయంగా ఫోన్ చేసి తన ఆత్మీయతను చాటుకున్నారు. పొరుగు దేశాల మధ్య ఉండాల్సిన దౌత్యాన్ని గుర్తు చేస్తూ పాకిస్తాన్‌, ఇండియాలలో ఉన్న పేదరికంపై సంయుక్తంగా పోరాడాల్సిన ఆవశ్యకతను మోదీకి ఇమ్రాన్ గుర్తు చేశారు.