కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి మంచి పేరుంది. ఎంతోమంది పేద విద్యార్థులను భవిష్యత్‌కి భరోసాగా ట్రిపుల్ ఐటీ నడుస్తూ వస్తుంది. అయితే అక్కడ ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు విద్యార్థినిల పేరేంట్స్‌ను కలవరపెడుతున్నాయి. పిల్లల రక్షణ బాధ్యతలు చూడాల్సిన ఎస్‌ఓ అర్జున్ నాయక్.. మహిళా సెక్యూరిటీ గార్డులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఉద్యోగాలు పోతాయని మౌనంగా భరించిన లేడీ స్టాఫ్..వేధింపులు మరింత ఎక్కువవ్వడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై ఎంక్వైరీ వేశారు. విచారణలో అతని వేధింపులు నిజమేనని తేలడంతో..ఎస్‌ఓ అర్జున్ నాయక్‌పై వేటు పడనుంది. ఓ సీఐ ర్యాంకు అధికారి ఈ రకంగా బుక్కవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా ఇప్పటికే ఎస్ఓగా విధులు నిర్వహిస్తున్న సీఐ అర్జున్ నాయక్ ట్రిపుల్ ఐటీ నుంచి పంపించేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ అన్బురాజన్ కు అధికారులు లేఖ పంపారు.