విద్యార్ధులకు బంపరాఫర్.. రూ. కోటి వరకూ ఎడ్యుకేషన్ లోన్..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన కాలేజీల్లో ఉన్నత చదువులు చదివే విద్యార్ధులకు ICICI బ్యాంక్ బంపరాఫర్‌ను ప్రకటించింది. వారం రోజుల పాటు ఎడ్యుకేషన్ లోన్‌ కోసం పడిగాపులు పడకుండా ఉండేలా రూ. 1 కోటి వరకూ తక్షణమే విద్యా రుణాన్ని మంజూరు చేయనుంది. ‘ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్’ పేరుతో తొలిసారిగా ఈ తరహ సదుపాయాన్ని అమలులోకి తీసుకొచ్చింది. పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే ఈ ప్రక్రియ జరగనుండగా.. డాక్యూమెంట్స్ సబ్మిట్ చేయడానికి బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం […]

విద్యార్ధులకు బంపరాఫర్.. రూ. కోటి వరకూ ఎడ్యుకేషన్ లోన్..

Edited By:

Updated on: Jun 23, 2020 | 8:53 PM

ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన కాలేజీల్లో ఉన్నత చదువులు చదివే విద్యార్ధులకు ICICI బ్యాంక్ బంపరాఫర్‌ను ప్రకటించింది. వారం రోజుల పాటు ఎడ్యుకేషన్ లోన్‌ కోసం పడిగాపులు పడకుండా ఉండేలా రూ. 1 కోటి వరకూ తక్షణమే విద్యా రుణాన్ని మంజూరు చేయనుంది. ‘ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్’ పేరుతో తొలిసారిగా ఈ తరహ సదుపాయాన్ని అమలులోకి తీసుకొచ్చింది.

పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే ఈ ప్రక్రియ జరగనుండగా.. డాక్యూమెంట్స్ సబ్మిట్ చేయడానికి బ్యాంకులను సంప్రదించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ‘ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్’ సౌకర్యం ద్వారా రుణ గ్రహీత క్షణాల్లో శాంక్షన్ లెటర్ పొందవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా 10 సంవత్సరాల లోపు లోన్ అమౌంట్‌ను తిరిగి చెల్లించేలా ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే విధానం…

  • ఐసీఐసీఐ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్‌లోకి లాగిన్ అయ్యి.. ముందుగా ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్‌ను చెక్ చేసుకోవాలి.
  • తీసుకునే లోన్ అమౌంట్, తిరిగి చెల్లించే పదవీకాలం, కళాశాల / విశ్వవిద్యాలయం పేరు, కాస్ట్ అఫ్ స్టడీ వంటి వివరాలను నమోదు చేయాలి. ఈ వివరాలు పొందుపరిచిన తర్వాత ఆటోమెటిక్‌గా మంత్లీ EMI ఎంత అన్నది అక్కడ డిస్‌ప్లే అవుతుంది.
  • విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వంటి ఇతరత్రా వివరాలను సైతం నమోదు చేయాలి. అంతేకాకుండా  ఫైనల్ ఆఫర్, టర్మ్స్ & కండిషన్స్‌ను చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) ద్వారా కన్ఫార్మ్ చేయాలి. అప్పుడు ఆ ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, శాంక్షన్ లెటర్ జనరేట్ అవుతాయి.
  • మీ మెయిల్‌కు రిలేషన్ షిప్ మేనేజర్ వివరాలతో కూడిన శాంక్షన్ లెటర్ ఒకటి వస్తుంది. ఇక ఫైనల్ స్టెప్‌గా అతనితో మీరు సంప్రదించాల్సి ఉంటుంది.
  • కాగా, ఈ ‘ఇన్‌స్టా ఎడ్యుకేషన్ లోన్’ పూర్తి వివరాల గురించి మీరు దగ్గరలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్‌ను సంప్రదించండి.

[svt-event date=”23/06/2020,8:53PM” class=”svt-cd-green” ]