ప్రపంచకప్ నిర్వహణపై వచ్చే నెలలో నిర్ణయం

|

Jun 10, 2020 | 10:30 PM

కరోనా వైరస్ క్రికెట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. T20 ప్రపంచకప్ నిర్వహణపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని తీర్మానం చేసింది ఐసీసీ

ప్రపంచకప్ నిర్వహణపై వచ్చే నెలలో నిర్ణయం
Follow us on

కరోనా వైరస్ క్రికెట్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచకప్ నిర్వహణపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని తీర్మానం చేసింది ఐసీసీ. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగాల్సిన టీ20 ప్రపంచకప్ భవితవ్యాన్ని వచ్చేనెలలో నిర్ణయం తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించుకుంది. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బోర్డు సమావేశాన్ని నిర్వహించిన ఐసీసీ.. ప్రపంచకప్​పై తుది నిర్ణయాన్ని జూలైలో తీసుకోవాలని భావిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో అక్టోబర్​ 18 నుంచి నవంబర్​ 15వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరుగాల్సిన టోర్నీ తీవ్ర సందిగ్ధంలో పడింది. జూన్​లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటామని గత నెల చెప్పిన ఐసీసీ.. మరింత కాలం వేచిచూస్తామని మరోసారి వెల్లడించింది. ప్రపంచకప్ నిర్వహణకు అనుకూలమైన వాతావరణం కోసం ఎదురుచూస్తున్నామని.. సభ్య దేశాలు, బ్రాడ్​కాస్టర్లు, భాగస్వాములు, ప్రభుత్వాలు, ఆటగాళ్లతో సంప్రదింపులు జరుపుతున్నామని.. త్వరలో సరైన నిర్ణయం తీసుకుంటామని బోర్డు సమావేశం అనంతరం ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది.