
I procured drugs For Sushant Says Rhea Chakraborty: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) విచారణలోకి నటి రియా చక్రవర్తి ఒప్పుకుందని సమాచారం. సుశాంత్ కోసమే తాను డ్రగ్స్ కొన్నట్లు రియా పేర్కొందట. షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరిండాల ద్వారానే డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించిందట.
కాగా, కేసు విచారణలో భాగంగా మళ్లీ రేపు విచారణకు హాజరు కావాలని ఆమెను అధికారులు ఆదేశించారు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎన్సీబీ రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌజ్ మేనేజర్ శామ్యూల్ మిరిండా, సుశాంత్ కుక్(వంట మనిషి) దీపేష్ శావంత్‌తో పాటు డ్రగ్ డీలర్ కైజన్‌ను అరెస్ట్ చేశారు. ఏ క్షణంలోనైనా రియా చక్రవర్తిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.