సైంటిస్ట్ మర్డర్‌కు “ఆ బంధమే” కారణం .. మిస్టరీ ఛేదించిన పోలీసులు

| Edited By:

Oct 04, 2019 | 5:46 PM

మూడు రోజుల క్రితం హత్యకు గురైన ఇస్రో శాస్త్రవేత్త మర్డర్ మిస్టరీని ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు . హత్యకు గురైన సైంటిస్ట్ సురేశ్ వేరొక వ్యక్తితో అనైతిక సంబంధాన్ని కొనసాగించడం, డబ్బులు డిమాండ్ చేయడమే హత్యకు ప్రధాన కారణమని సీపీ చెప్పారు. బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో సురేశ్ శాస్త్రవేత్తగా పనిచేస్తూ ..అమీర్‌పేటలోని ధరమ్‌కరణ్ రోడ్డులో గల తన […]

సైంటిస్ట్ మర్డర్‌కు ఆ బంధమే కారణం .. మిస్టరీ ఛేదించిన పోలీసులు
Follow us on

మూడు రోజుల క్రితం హత్యకు గురైన ఇస్రో శాస్త్రవేత్త మర్డర్ మిస్టరీని ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు . హత్యకు గురైన సైంటిస్ట్ సురేశ్ వేరొక వ్యక్తితో అనైతిక సంబంధాన్ని కొనసాగించడం, డబ్బులు డిమాండ్ చేయడమే హత్యకు ప్రధాన కారణమని సీపీ చెప్పారు.

బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో సురేశ్ శాస్త్రవేత్తగా పనిచేస్తూ ..అమీర్‌పేటలోని ధరమ్‌కరణ్ రోడ్డులో గల తన ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఈనెల 1 వతేదీన సురేశ్ భార్య ఇందిరా.. ఆయనకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సురేశ్ ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. వెంటనే తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూసే సరికి సురేశ్ తన గదిలో హత్య చేయబడి విగత జీవిగా కనిపించాడు.

ఈ కేసులో పోలీసులు మృతి ఎలా జరిగిందనే దానిపై పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సురేశ్ వద్దకు తరచూ ఎవరు వస్తున్నారు, ఫోన్ కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజ్, వేలిముద్రలు వంటి వాటిని సేకరించి విచారణ చేపట్టారు. దీంతో మృతుడు సురేశ్ వద్దకు శ్రీనివాస్ అనే వ్యక్తి వచ్చి వెళ్తునట్టుగా గుర్తించారు. శ్రీనివాస్ స్ధానికంగా ఉన్న ఓ మెడికల్ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌కు మృతుడికి మధ్య పరిచయం ఏర్పడింది. భార్యకు దూరంగా నివసిస్తున్న సురేశ్.. కాలక్రమేణా శ్రీనివాస్‌తో అనైతిక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే దీన్ని సాకుగా తీసుకుని సురేశ్‌ను శ్రీనివాస్ పలుమార్లు డబ్బులు డిమాండ్ చేశాడు . ఎంతకీ ఇవ్వకపోవడంతో చంపాలని నిర్ణయించుకుని కత్తితో హతమార్చాడు.

ఈ కేసులో మృతుడు సైంటిస్ట్ సురేశ్, నిందితుడు శ్రీనివాస్ మధ్య అనైతిక బంధం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం శ్రీనివాస్ తమ అదుపులోనే ఉన్నాడని సీపీ తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ వద్ద నుంచి ఇతడి వద్దనుంచి ఒక కత్తి, రెండు ఉంగరాలను స్వాధీనం చేసుకున్నారు.