
విజయవాడ నగరంలో కుండపోతగా వర్షం పడుతూనే ఉంది. వాన నీటితో బెజవాడ నగరం తడిసి ముద్దవుతోంది. నగరంలోని ప్రధాన రహదారులు జలమయమై చెరువులను తలపిస్తున్నాయి. దాంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలవాసులు మరింత ఇబ్బందులు పడుతున్నారు.
వన్ టౌన్, పాళీక్లినిక్ రోడ్డు, నక్కల రోడ్డు, గణపతిరావు రోడ్డు, గాంధీబొమ్మ సెంటర్, నైజం గేట్ సెంటర్ రోడ్డు ఇతర ప్రాంతాలు వర్షం నీటిలో మునిగాయి. రోడ్లపై మోకాలు లోతు వర్షపు నీళ్లు రావటంతో వాహన చోదకులు నానా అవస్థలు పడ్డారు. వన్ టౌన్ ప్రాంతంలోని రోటరీ నగర్‌లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరాయి. దీంతో నిర్వాసితులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఎక్కడ నీరు అక్కడే నిలిచి పోవడంతో జనం రోడ్లపైకి వచ్చేందు ఒటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు.