Best Laptops: మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ల్యాప్‌టాప్‌లు ఇవే.. ధర కూడా చాలా తక్కువ..

|

Apr 23, 2023 | 3:39 PM

ల్యాప్ టాప్ లపై అందరికీ అవగాహన ఉండదు. టెక్ ఉద్యోగాలు చేసే వారికి, ఐటీ ప్రొఫెనల్స్ కి తప్ప వాటిని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మరి అలాంటి సమయంలో మంచి ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలంటే కష్టమే. అందుకే మీకు ఆ కష్టం రాకుండా బెస్ట్ ల్యాప్ టాప్స్ అనువైన బడ్జెట్ లో మీకు అందిస్తున్నాం.

Best Laptops: మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ల్యాప్‌టాప్‌లు ఇవే.. ధర కూడా చాలా తక్కువ..
Laptop
Follow us on

ఇటీవల కాలంలో ల్యాప్ టాప్ ల వినియోగం బాగా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ పెరగడం, పిల్లలు కూడా ఇంట్లో చదువుకునేందుకు కూడా ల్యాప్ టాప్ లను కావాలని అడుగుతుండటంతో దానిని కలిగి ఉండటం అనివార్యం అవుతోంది. అయితే ల్యాప్ టాప్ లపై అందరికీ అవగాహన ఉండదు. టెక్ ఉద్యోగాలు చేసే వారికి, ఐటీ ప్రొఫెనల్స్ కి తప్ప వాటిని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మరి అలాంటి సమయంలో మంచి ల్యాప్ టాప్ కొనుగోలు చేయాలంటే కష్టమే. అందుకే మీకు ఆ కష్టం రాకుండా బెస్ట్ ల్యాప్ టాప్స్ అనువైన బడ్జెట్ లో మీకు అందిస్తున్నాం. మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న బెస్ట్ ల్యాప్ టాప్ లు ఇవి. వాటి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి..

అసుస్ వివోబుక్15 ల్యాప్ టాప్..

ఈ 15.6అంగుళాల ల్యాప్‌టాప్‌ను సరసమైన ధరలో కొనుగోలు చేయవచ్చు . దీనిలో జీవితకాల చెల్లుబాటుతో విండోస్ 11 హోమ్‌ ముందే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది. ఇది చూడటానికి సన్నగా, తేలికగా ఉంటుంది. ఇది 4 నుంచి 8 జీబీ ర్యామ్ లలో అందుబాటులో ఉంటుంది. అంతర్నిర్మిత స్పీకర్లు, మైక్రోఫోన్‌ ఉంటుంది. గరిష్టంగా 1టీబీ వరకూ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ హెచ్ డీ గ్రాఫిక్స్ కో ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ట్రాన్స్ పరరెంట్ సిల్వర్ కలర్ అమెజాన్ లో అందుబాటులో ఉన్న దీని ధర రూ. 25,990గా ఉంది.

లెనోవో వీ15 జీ3 15 అంగుళాల ల్యాప్ టాప్..

అధిక పనితీరు కలిగిన ఈ ల్యాప్ టాప్ 15 అంగుళాల వేరియంట్లో బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీని లుక్, డిజైన్ అద్భుతంగా ఉంటాయి. దీనిలో 15.6 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. సమర్థవంతమైన సౌండ్ సిస్టమ్, అధిక-నాణ్యత గ్రాఫిక్స్, మెరుగైన పనితీరుతో ఆకట్టుకుంటుంది. 8జీబీ ర్యామ్ తో పాటు 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కోప్రాసెసర్ ఉంటుంది. బ్లాక్ కలర్ లో అమెజాన్ లో అందుబాటులో ఉన్న దీని ధర 37,800.

ఏసర్ ఎక్స్ టెన్సా 15 ఇంచ్ ల్యాప్ టాప్..

ఈ ల్యాప్ చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. ఇది కూడా 15.6 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజితో వస్తుంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. అలాగే ఇంటెల్ యూహెచ్ డీ గ్రాఫిక్స్ కో ప్రాసెసర్ ఉంటుంది. సిల్వర్ కలర్ ఆప్షన్ లో అమెజాన్లో ఈ ల్యాప్ టాప్ ధర రూ. 38,999గా ఉంది.

హానర్ మ్యాజిక్ బుక్ 15 ఇంచ్ ల్యాప్ టాప్..

ఈ అద్భుతమైన 15-అంగుళాల ల్యాప్‌టాప్ నమ్మశక్యం కాని స్క్రీన్‌ను కలిగి ఉంది. అల్ట్రా-సన్నని బెజెల్స్, ఐ కంఫర్ట్ షీల్డ్ పాప్-అప్ కెమెరా ఉన్నాయి. అధిక-రేటెడ్ 15-అంగుళాల ల్యాప్‌టాప్ అల్యూమినియం యూనిబాడీతో రూపొందించబడింది. చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. ఇది 65W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అద్భుతమైన బ్యాటరీ జీవితాన్ని కూడా అందిస్తుంది. అత్యధికంగా అమ్ముడవుతున్న 15-అంగుళాల ల్యాప్‌టాప్‌లో 8జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇంది విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై ఆధారపడి పనిచేస్తుంది. ఏఎండీ ర్యాడియన్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. గ్రే కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉన్న దీని ధర అమెజాన్ లో కేవలం రూ. 39,990గా ఉంది.

ఏసర్ యాస్పైర్ 3 ల్యాప్ టాప్..

నిస్సందేహంగా భారతదేశంలోని అత్యుత్తమ 15-అంగుళాల ల్యాప్‌టాప్‌లలో ఇది ఒకటి. దీనిలో బ్యాక్‌లిట్ ఎల్సీడీ వెబ్‌క్యామ్ వంటి ఫీచర్లున్నాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 9 గంటల బ్యాటరీని అందిస్తుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. ఆక్సిజన్ ఓఎస్ బేస్డ్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. ఇంటెల్ యూహెచ్ డీ గ్రాఫిక్స్ కో ప్రాసెసర్ ఉంటుంది. సిల్వర్ కలర్ ఆప్షన్ అమెజాన్ లో దీని ధర రూ. 42,990గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..