తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు..

తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని ధర్మపురి, ఈరోడ్ ,సేలం ,క్రిష్ణగిరి ,దిండిగల్ ,మధురై జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తమిళనాడును ముంచెత్తిన భారీ వర్షాలు..
Follow us

|

Updated on: Sep 04, 2020 | 11:24 AM

Heavy Rains In Tamilnadu: తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు, జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. గత కొద్దిరోజులుగా రాష్ట్రంలోని ధర్మపురి, ఈరోడ్ ,సేలం ,క్రిష్ణగిరి ,దిండిగల్ ,మధురై జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే సత్యమంగళం అటవీ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.

అంతేకాకుండా జలపాతాల నుంచి భారీగా వరద నీరు కిందికి దిగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. దీనితో అధికారులు ఆ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపేశారు. ఇక ధర్మపురి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కావేరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాగా, రాష్ట్రంలోని 7 జిల్లాలో మరో 48 గంటలపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..