తెలంగాణకు హెచ్చరిక.. 3 రోజులు అత్యంత భారీ వర్షాలు

|

Sep 14, 2020 | 5:33 PM

వచ్చే మూడు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 17వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా...

తెలంగాణకు హెచ్చరిక.. 3 రోజులు అత్యంత భారీ వర్షాలు
Follow us on

వచ్చే మూడు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 17వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా తెలంగాణలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు చెబుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, దీనికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణమని వాతావరణ శాఖ అధికారి చెబుతున్నారు. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పియర్ లెవెల్ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కూడా భారీ వర్షాలకు దారితీయనుందని ఆయన అంటున్నారు. తూర్పు విదర్భ, చత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో 0.9 కిలో మీటర్ ఎత్తు వరకు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా తెలంగాణపై ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, దానికి రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడం తెలంగాణ వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలకు దారితీస్తున్నాయని, వచ్చే మూడు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 17వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. చాలా చోట్ల భారీ వర్షాలకు అవకాశాలున్నాయని, మరికొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు వివరించారు.