హైదరాబాద్‌ను వీడని ముసురు

హైదరాబాద్‌ను ముసురు ముంచేస్తోంది. సురువానకు ఇండ్ల నుంచి బయటకెళ్లే పరిస్థితి లేదు. జనం రోజువారి కార్యకలాపాలకు ఆటంకం...

హైదరాబాద్‌ను వీడని ముసురు

Updated on: Aug 15, 2020 | 6:32 AM

Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌ను ముసురు ముంచేస్తోంది. ఈ ముసురువానకు ఇండ్ల నుంచి బయటకెళ్లే పరిస్థితి లేదు. జనం రోజువారి కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. సనత్‌నగర్‌, ఈఎస్‌ఐ, ఎస్సార్‌నగర్‌, బేగంపేట, బోయినపల్లి, తిరుమలగిరి, మారేడ్‌పల్లి, చిలుకలగూడ, అల్వాల్‌, హిమాయత్‌నగర్‌, నారాయణగూడ, కోఠి, బేగంబజార్‌, చాంద్రయాణగుట్ట, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, బహదూర్‌పురా, పురానాపూల్‌, హైదర్‌నగర్‌లో వర్షం పడుతూనే ఉంది.

అలాగే బంజారాహిల్స్‌, కూకట్‌పల్లి, మూసాపేట, నిజాంపేటతో పాటు పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లపై భారీగా వర్షం నీరు నిలిచింది.ఇలా చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.

ఈ వానకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పలు చోట్ల భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

అయితే ఇలా మరో రెండు రోజుల పాటు వర్షం కురుస్తునే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని పేర్కొంది.