హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బంపర్ ఆఫర్.. కేవలం 10 సెకన్లలో లోన్..

వాహన రుణాలు తీసుకోవాలనుకునే వారికి శుభవార్త. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ కస్టమర్లకు తక్షణమే రుమాలు మంజూరు చేసేందుకు జిప్‌డ్రైవ్ ఇన్‌స్టంట్ ఆటో లోన్స్ ప్రారంభించింది. వాహన రుణాలు తీసుకోవాలనుకునే

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బంపర్ ఆఫర్.. కేవలం 10 సెకన్లలో లోన్..

Edited By:

Updated on: Jul 04, 2020 | 1:44 PM

వాహన రుణాలు తీసుకోవాలనుకునే వారికి శుభవార్త. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తమ కస్టమర్లకు తక్షణమే రుణాలు మంజూరు చేసేందుకు జిప్‌డ్రైవ్ ఇన్‌స్టంట్ ఆటో లోన్స్ ప్రారంభించింది. వాహన రుణాలు తీసుకోవాలనుకునే కస్టమర్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించొచ్చు. ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్ కింద బ్యాంకు కస్టమర్లకు కేవలం 10 సెకన్లలో లోన్లు మంజూరు చేస్తోంది.

ఏపీ‌లోని భీమవరంతో పాటు భారతదేశంలోని 1000 టైర్ 2, 3 పట్టణాల్లో ఈ ఆఫర్స్ అందిస్తోంది. ఆన్‌లైన్‌లో అత్యంత వేగంగా రుణాలు మంజూరు చేసే విధానం జిప్‌డ్రైవ్ అని చెబుతోంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు. టెక్నాలజీ సాయంతో రుణాలు వేగంగా కస్టమర్ల అకౌంట్‌లో క్రెడిట్ అవుతాయి.

[svt-event date=”03/07/2020,11:01PM” class=”svt-cd-green” ]

Also Read: ముంబైలో భారీ వర్షాలు.. పురాతన భవనాలకు ముప్పు..