
సింఘు సరిహద్దుల్లో 10 రోజులుగా నిరసన చేస్తున్న రైతుల్లో అజయ్ మోరె అనే 32 ఏళ్ళ అన్నదాత గజగజ వణికించే చలికి తట్టుకోలేక మృతి చెందాడు. రెండు వారాలుగా రైతులు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. తన ట్రాలీలోనే అజయ్ మోరె మృతదేహాన్ని బుధవారం కనుగొన్నారు. హర్యానా లోని సోనీపట్ కు చెందిన ఇతనికి వృధ్ధులైన తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్నదాతల ఆందోళన ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు 5 గురు రైతులు మృతి చెందారు. రైతు చట్టాలను కేంద్రం రద్దు చేయాలని కోరుతూ వేలాది అన్నదాతలు ఆందోళన చేస్తుండగా., ఆ ప్రసక్తే లేదని ప్రభుత్వం పట్టుబట్టడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కనీస మద్దతు ధరపై ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.
నిన్నటికి నిన్న హోం మంత్రి అమిత్ షాతో రైతు సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో.. కేంద్రం తాజాగా సంబంధిత చట్టాల సవరణకు అంగీకరిస్తూ వారికి ప్రతిపాదనలు పంపింది.