కరోనాతో కలిగిన నష్టాలనుపూడ్చడంలో ప్రజలకు ఉపాధి కల్పించడంలో వాణిజ్య, పరిశ్రమల రంగానిదే కీలక భూమిక అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వాణిజ్య , పారిశ్రామిక రంగాలు, పునరుత్తేజం అవుతూ లక్షలాది ప్రజల ఉపాధి వ్యవస్ధలను కాపాడుతున్నాయని అన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ‘కోవిడ్ నష్ట నివారణలో ప్రభుత్వాల వ్యూహాత్మక చర్యలు’ అన్న అంశంపై గవర్నర్ సౌందరరాజన్ ప్రసంగించారు. భారత ప్రధాని నరేంద్రమోదీ సరైన సమయంలో సరైన చర్యలు, సకాలంలో లాక్‌డౌన్‌తో ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడాలని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే మార్గంలో సమర్దవంతమైన చర్యలు తీసుకుందని గవర్నర్ అన్నారు.